24-11-2025 12:28:14 AM
-అంపశయ్యపై శాంతిఖని
-ఫలించని ఆధునిక టెక్నాలజీ
-లోప భూయిష్టమైన ప్రణాళికలు
-గని భవిష్యత్ పై ఆందోళన
-జాయీ కంపెనీ తర్జన భర్జన
-వెయ్యి కోట్లు నేలపాలు
-కార్మికులను తగ్గించే యోచన
-పట్టించుకోని కార్మిక సంఘాలు
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 23 : సింగరేణిలో పురాతన బొగ్గు గనుల్లో మిగిలిన ఏకైక గని శాంతిఖని... దాని భవిష్యత్ పై అంధకారం అలుముకుంది. అధికారుల అవగాహన రాహిత్యం, చారిత్రక తప్పిదాలు శాపంగా మారాయి. ఫలితంగా నేడు శాంతిగని అంపశయ్యకు చేరింది. జీవన్మరణ సమ స్యలతో కొట్టుమిట్టాడుతుంది.
ఈ గని మూతపడిపోతుందోనని కార్మికులు ఆందోళన పడిపోతున్నారు. అధికారుల ఘోరమైన తప్పిదాలు ఈ విషమ పరిస్థితికి దారితీశాయి. కోట్ల రూపాయలు వెచ్చించి మెగా ప్రాజెక్టుగా మార్చడం కోసం ఇంత వరకు చేసిన ప్రయోగాలన్నీ, చిత్తశుద్ది లోపంతో ఒక్కటొక్కటిగా విఫలమవుతూ వస్తున్నాయి. గమ్యం తప్పింది..., శాంతిగని ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
ఆధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తిని మెరుగుపరచాలని భారీ ప్రయత్నాలు ఎంతకూ ఫలించడం లేదు. 1952లో బెల్లంపల్లిలో శాంతి గనిని ఏర్పాటు చేశారు. 1991 ముందు వరకు వేలాది మంది కార్మికులతో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అవలీలగా సాధిస్తూ, ప్రగతి పథంలో మిగిలిన గనులతో పాటు శాంతిగని కూడా సింగరేణికి కీలకంగా నిలిచింది.
నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల ప్రవేశం సింగరేణి తిరోగమనానికి బీజం వేశాయి. అందులో భాగంగానే సింగరేణి యాజమాన్యం యాంత్రీకరణ, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణలను వేగవంతం చేసింది. ఖర్చు తక్కువతో ఎక్కువ లాభాలు ఆశించి అనేక సంస్కరణలకు అధికారులు తెరతీశారు. అవి భూగర్భ గనులకు కోలుకోలేని చేటు చేశాయి. విదేశీ టెక్నాలజీని ఆశ్రయించి భారీ యంత్రాలతో బొగ్గు ఉత్పత్తిని చేపట్టేందుకు గైకొన్న సకల చర్యలు సింగరేణి కంపెనీనీ కొంప ముంచాయన్న విమర్శలను నెత్తినవేసుకుంది యాజమాన్యం.
లాంగో వాల్ ప్రాజెక్టుగా శాంతిఖని...
అతి పురాతనమైన భూగర్భ శాంతి గని లో ఆధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తికి భారీ యంత్రాలతో సంకల్పించింది. ఈ తలంపుతో సింగరేణి యాజమాన్యం 2014 దశకంలో శాంతిగనిని మెగా ప్రాజెక్టుగా ప్రకటించింది. అందుకోసం రూ. 500 కోట్లు తొలి విడతగా కేటాయించింది. ఇక అప్పటి నుంచి మెగా ప్రాజెక్టు పనుల సన్నాహాల్లో భాగంగా అనేక భారీ యంత్రాలతో ప్రయోగాలకు అధికారులు పూనుకున్నారు.
నిర్దిష్ట మైన, గని నైసర్గిక, భౌగోళిక పరిస్థితులకు తగినట్టు ప్రణాళికలు లేకపోవడంతో సుదీర్ఘకాలంగా ప్రాజెక్టు సన్నాహక పనులు సాగు తూనే ఉన్నాయి. ఈ క్రమంలో శాంతి గనిని సాంకేతికంగా ఎప్పటికప్పుడు వేగంతమైన మార్పు లు, అందుకు తగినట్టుగా యంత్రాలను ప్రయోగించారు. తొలుత శాంతి గనిలో 2004 లో ఎస్‌డీఎల్ యంత్రాలతో సాంకేతక పని విధానానికి అం కురార్పణకు పూనుకున్నారు.
బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో అధికారుల నైపుణ్యం, ప్రణాళిక రహిత విధానాల వల్ల ఎస్‌డీఎల్ యంత్రాలతో ఫలితా లు అంతగా కనిపించ లేదు. ఆదిలోనే హం స పాదం అన్నట్టు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇదే క్రమంలో గనిలో దూర భారం, కార్మికులను నిత్యం నరకాన్ని చూపించేది. నడకతోనే సుదీర్ఘ దూరం వెళ్ళి బొగ్గును ఉత్పత్తి చేసేవారు. కిలో మీటర్ల దూరంలో ఉన్న పని స్థలాల వద్దకు వెళ్లి కార్మికులు రెక్క లు ముక్కలు చేసుకునే వారు.
ఈ పరిస్థితి కార్మికుల గైర్హాజరుపై తీవ్ర ప్రభావం చూపిం ది. ఈ నేపథ్యంలో కార్మికుల సంక్షేమం కోసం మ్యాన్ రైడింగ్ ను అమల్లోకి తెచ్చా రు. మరోవైపు లాంగో వాల్ ప్రాజెక్టు ఏర్పా టు లక్ష్యం నెరవేర్చే సంస్కరణలో భాగంగా 2002లో శాంతిగని సిఎస్పిని ఎత్తివేశారు. కార్మికులను అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. సీఎస్పీని ఎత్తివేసిన యాజమాన్యం 2004 లో కన్వేయర్ బెల్ట్ సిస్టంను అమల్లోకి తెచ్చింది. భూగర్భంలో ఉత్పత్తి అయిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా ఉపరితలానికి వచ్చేది.
ఇదే క్రమంలో లాడీసుల ద్వారా ఉపరితరానికి బొగ్గుతరలించే విధానం, కన్వేయర్ బెల్ట్‌తో నిలిచిపోయింది. ఎస్‌డిఎల్ యంత్రాల ప్రవేశంతో గనుల పూర్వ పని విధానంలో పెను మార్పులు వచ్చాయి. అప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిలో సింహ బాగాన ఉన్న కోల్ ఫిల్లింగ్ సిస్టంలో విప్లవాత్మక మార్పుచోటుచేసుకుంది. కోల్ పిల్లర్లు ఎస్ డి ఎల్ యంత్రాల ఆపరేటర్లుగా కొత్త రూపం ఎత్తారు. ఎస్‌డిఎల్ యంత్రాలు అధికారుల చిత్తశుద్ధి లోపం వల్ల నిష్ప్రయోజనంగా మారిపోయాయి. దీంతో ఎస్ డి ఎల్ ఆపరేటర్లను జనరల్ పనులకు కేటాయించారు.
నీరుగారిన ప్రయోగాలు...
లాంగ్ వాల్ మెగా ప్రాజెక్ట్ నిర్వహణలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.. ప్రాజెక్టు పేరుతో యజమాన్యం కార్మికుల అస్తిత్వాన్ని దెబ్బతిస్తూ వచ్చింది. భారీ యంత్రాల పనుల నిర్వహణన పై కంపెనీ చివరికి చేతులెత్తేసింది. ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించింది. జేఎంఎస్ కంపెనీకి బొగ్గు ఉత్పత్తి, ప్రాజెక్టు సన్నాహాక పనులను అప్పగించింది. ఇదంతా లాంగ్ వాల్ మెగా ప్రాజె క్టు కోసమని నమ్మబలికి కార్మికులను పరాయీకరణ చేశారు.
ఎస్‌డిఎల్ యంత్రాలతో మొదలైన యాంత్రికరణ పనితీరు బోల్టర్ మైనర్, కంటిన్యూస్ మైనర్ వంటి భారీ యంత్రాలతో సాగుతూనే ఉంది. నిర్దేశిత శాంతిగని మెగా ప్రాజెక్టు కల నెరవేరలేదు. ఇంకా సుదీర్ఘకాలంగా నిర్మాణ పనుల పేరిట కాలయాపన చేస్తూనే ఉన్నారు. రూ.500 కోట్లతో మొదలైన వ్యయం రూ.1000 కోట్ల కు దాటిందనీ సమాచారం. ‘ఆపరేషన్ సక్సె స్ పేషంట్ డెడ్‘ అన్న రీతిలో సింగరేణి అధికారుల పనితీరు సాగుతుంది. మెగా ప్రాజె క్టుకు కేటాయించిన భారీ బడ్జెట్లో కమీషన్లను ఉన్నతాధికారులు భారీగా దండుకున్నట్లు విమర్శ లు కూడా ఉన్నాయి.
సింగరేణిలో అడ్యాలప్రాజెక్టు తర్వాత అంతటి మెగా ప్రాజెక్టు సింగరేణిలో శాంతిఖనే. యజమాన్యం శాంతిఖనిపై భారీ భరోసాను పెట్టుకుంది. అందు కోసం నిధులను భారీ ఎత్తున కేటాయించింది. ప్రాజెక్టు నెలకొల్పు ప్రక్రియ విధానములో అధికారుల చిత్తశుద్ధిలేమీ, ప్రధానంగా నైపుణ్య విభాగం నిర్దేశిక త్వంలో ప్రణాళికల అమలు జరగడం లేద న్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ యజమాన్యం సరిగా గైడ్ చేయకపోవడం కూడా ప్రధాన లోపంగా కనిపిస్తోంది.
కేవలం డైరెక్టర్లపై భారం మోపి చేతులెత్తేసింది. ఉన్నత యజమాన్యం ప్రధా న నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుందన్న విమ ర్శలు ఉన్నాయి. ఈ వైపల్యాలను మొత్తంగా చూస్తే.. సింగరేణికి మరో మణిహారమైన శాంతిగనీ లాంగ్ వాల్ ప్రాజెక్టు ను సింగరేణికి భారంగా మార్చి వేశారు. ఇక బొగ్గు ఉత్పత్తికి చేపట్టిన ఆధునిక యంత్రాల ప్రయోగం ఈ గనిలో ఎంతమాత్రం పనికిరాకుండా పోయాయి. గని మనగడపై యజమాన్యం మీనమేషాలు లెక్కిస్తుంది.
ప్రశ్నార్థకమైన శాంతిగని మనుగడ...
సింగరేణిలో తొలితరం భూగర్భ గని చరిత్రకు సాక్ష్యమైనా శాంతిగని మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇది ఇలా ఉండగా జెఎంఎస్ కంపెనీ కూడా పనుల నిర్వహణలో చేతులెత్తే పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. శాంతి గనినీ తిరిగి యజమాన్యమే చేపట్టి చిత్తశుద్ధితో పనులు చూపిస్తే శాంతి గని బతికి బట్టగలదన్న ఆశాభావం కార్మికుల్లో బలంగా వ్యక్తం అవుతున్నది. తరగనీ బొగ్గు నిక్షేపాలకు నెలవైన శాంతిగనికి ఇంకా 40 ఏళ్ల సుదీర్ఘ జీవిత కాల ముంది.
ఇప్పటికైనా సింగరేణి యాజమా న్యం శాంతిగనినీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సరికొత్త ప్రణాళికలతో నిలబెట్టి సింగరేణి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఇలాంటి ప్రధాన భూమికను పక్కన పెట్టీ కార్మికులను బదిలీలు చేసేందుకు యోచన చేయడం ఎంత వరకూ తగదు.
ఇలాంటీవి గని మనుగడకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. పూర్తి అవగాహనాలేమి విధాలని విమర్శలు వ్యక్తం అవు తున్నా యి. ఇదంతా ఎందుకు రిస్కనీ, బొగ్గు ఉత్పత్తికి పనికిరాదనే నేపంతో శాంతిగనినీ మూసేసి చేతులు దులుపుకునే యోచనలో కూడా యాజమాన్యం ఉన్న ట్టు తెలుస్తోంది. తప్పుడు విధానాలతో గని భవిష్యత్తును చేతులారా నాశనం చేసింది సరిపోదన్నట్టు మూసివేసేందుకు ఆలోచించడం మరో ఘోరమైన తప్పిదమే అవు తుంది.
ఇప్పటికీ తమ తప్పులను సమీక్షించి కోవడానికి సిద్ధపడనీ అధికారుల తీరుపై కార్మికుల్లో ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి. ఇంత జరుగుతోన్నా.. గని భవిష్యత్ కోసం సింగరేణి ప్రధాన కార్మిక సంఘాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నా యి. శాంతిఖని భవిష్యత్ పై వారికి బాధ్యత లేదా..? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు శాంతిఖని మెగా లాంగ్వాల్ ప్రాజెక్టు అయ్యే పరిస్థితుల్ని అధికారులు ఉద్దేశ పూర్వకంగానే తోసి పుచ్చు తున్నారన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
28న డెరెక్టర్ల మీటింగ్ పై ఉత్కంఠ...
శాంతిఖని భవిష్యత్ కోసం ఈ నెల 28న కొత్తగూడెంలో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ అధ్యక్షతన డైరెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశం లో ప్రధానంగా శాంతిఖని పైనే చర్చిస్తారని తెలుస్తోంది. లాంగ్ వాల్ మెగా ప్రాజెక్టు సన్నాహాల్లో తలెత్తిన పరిస్థితిని అధికారులు సమీక్షించను న్నారు. గని పురోగతికి చేపట్టే చర్యలపై ఈ సమావేశంలో ఏం నిర్ణయం జరుగతదోననీ కార్మికులు ఆసక్తితో చూస్తున్నారు. శాంతిఖని భవిష్యత్ ఈ సమావేశంలో తేలిపోతుందని కార్మికుల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అధికారులు ఏమి చేస్తారో చూడాలి మరి.
భారీ యంత్రాలతో పనులు
ఎస్‌డిఎల్ యంత్రాల పనితీరు విఫలం కావడంతో 2014లో కంటిన్యూస్ మైనర్(సీఎంఆర్) యంత్రాన్ని పనుల్లోకి పెట్టారు. కొంతకాలం పని చేసిన ఆ యంత్రం కూడా బెడిసి కొట్టిం ది. 2017లో మరో యంత్రం బోల్టర్ మైనర్ (బిఎం) ను ప్రవేశపెట్టారు. దీంతో కూడా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భారీ యంత్రాలతో సన్నాహక బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలోనే 2020లో షాప్టు ను ఏర్పాటు చేశారు.
ఇక పాత గని నుంచి కార్యకలాపాల నిర్దేశిత వ్యవస్థను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పా టు చేసిన షాప్టు వద్దకు షిఫ్ట్ చేశారు. ఇదే క్రమంలో గనిలో కార్మికుల సంఖ్య బారీగా తగ్గుతూ వచ్చింది. రెండువేల కార్మికులకు గాను ప్రస్తుతం 430 మంది కార్మికులు మాత్రమే శాంతిఖనిలో మిగిలారు.
యాంత్రీకరణ పుణ్య మా అని కార్మికులను క్రమేనా తగ్గించేందుకు చేపట్టిన సంస్కరణలపై కార్మికు ల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమ వుతు న్నాయి. బొగ్గుగనిలో ఉత్పత్తి ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని నెలలుగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అవరోధాలు నెలకొన్నాయి. కనీ సం షిఫ్ట్‌కు వంద టన్నుల బొగ్గు ఉత్ప త్తి గగనమైంది. ఇదీ శాంతిఖని దుస్థితి.