calender_icon.png 22 May, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి డివిజన్ కేశవనగర్‌లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

15-05-2025 01:47:23 AM

శేరిలింగంపల్లి, మే 14: పరిశుభ్రమైన వాతావరణంతో మాత్రమే ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ గారు అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా వ్యాధులను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ కేశవనగర్ లో  జిహెచ్‌ఎంసి శానిటేషన్  సిబ్బంది ,స్థానిక నేతలు ,నాయకులు కార్యకర్తలు తో కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కేశవ నగర్ లో నెలకొన్న సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను చెత్తా చె దారాన్ని శానిటేషన్ వర్కర్స్ తో తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా  ఆయన మా ట్లాడుతూ... వ్యాధుల వ్యాప్తి అపరిశుభ్రమైన వాతావరణం కారణంగానే జరుగుతుందని అన్నా రు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. నాలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈశ్వర్,తిరుపతి,సుమన్, నగేష్,రాజు, శ్రీను,యాదయ్య,గోవింద్, హనుమంతు,మల్లేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.