16-08-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మధ్యకాలంలో దేశంలోకి బంగా రం దిగుమతులు క్షీణించాయి. నిరుడు ఇదేకాలంతో పోలిస్తే పుత్తడి దిగుమతులు 4.23 శాతం తగ్గి 12.64 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు తాజా వాణిజ్యశాఖ గణాం కాలు వెల్లడిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 13.2 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. ఈ ఏడాది మే నెలలో బంగారం దిగుమతులు 9.76 శాతం తగ్గగా, జూన్‌లో భారీగా 38.66 శాతం క్షీణించాయి. ఏప్రిల్ నెలలో మాత్రం 1 బిలియన్ డాలర్ల నుంచి 3.11 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
అధిక ధరలే కారణం
బంగారం ధర భారీగా పెరిగినందున, దిగుమతులు తగ్గాయని జ్యువెలర్లు చెపుతున్నారు. అయితే పండుగ సీజన్ ప్రారంభంకానున్నందున సెప్టెంబర్ నుంచి మళ్లీ దిగుమతులు పెరుగుతాయని, ఇటీవల బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గించడం కూడా తమ అమ్మకాలకు కలిసి వస్తుందని జ్యువెలర్లు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.