23-10-2025 01:03:54 AM
హెచ్‌పీఆర్‌సీ వేదికగా పోటీలు
హైదరాబాద్, అక్టోబర్ 22(విజయక్రాంతి) : ఐపీఎల్ స్ఫూర్తితో దాదాపు ప్రతీ క్రీడలో లీగ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఒలింపిక్ స్పోర్ట్ అయిన ఈక్వెస్ట్రియన్‌లోనూ లీగ్ వచ్చేసింది. తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ అసోసియేషన్(టీఎస్‌ఈఏ) ఆధ్వర్యం లో రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్ జరగబోతోం ది. హెచ్‌పీఆర్‌సీ వేదికగా గురువారం నుంచి 4 రోజుల పాటు రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్, తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ కాంపిటేషన్ నిర్వహిస్తున్నారు.
అండర్ 10 కేటగిరీ రైడర్లతో పాటు జూనియర్, యంగ్ రైడర్ల నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ లీగ్ నిర్వహిస్తున్నట్టు హెచ్‌పీఆర్‌సీ ప్రెసిడెంట్ చైతన్య కుమార్ చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ పోలో రైడింగ్ క్లబ్‌గా హెచ్‌పీఆర్‌సీ ఉం డడంతో రైడర్లు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. కాగా గత మూడేళ్ళుగా ఈక్వెస్ట్రియన్‌పై ఆసక్తి పెరిగి చాలా మంది నేర్చు కుంటున్నారని హెచ్‌పీఆర్‌సీ సెక్రటరీ రియా జ్ అహ్మద్ చెప్పారు. రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్‌లో డ్రెస్సేజ్, షోజంపింగ్ విభాగా ల్లో నూ, తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ కాంపిటేషన్‌లో హ్యాక్స్, డ్రెస్సేజ్, షోజంపింగ్ విభా గాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. హె చ్‌పీఆర్‌సీ వైస్ ప్రెసిడెంట్ సాయి విజేందర్‌సింగ్, రైడింగ్ కమిటీ మెం బర్లు సైఫ్ అట్టా రి, వర్ష దాట్ల, టీఎస్‌ఈఏ సెక్రటరీ రఘు పంచకర్ల, టీఎస్‌ఈఏ వైస్ ప్రెసిడెంట్ సిరాజ్ అట్టారి పాల్గొన్నారు.