calender_icon.png 24 October, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకరోజు జీతములో కోత

23-10-2025 07:56:20 PM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి..

కొండపాక: కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య ఉప కేంద్రంలో అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎం ఎల్ ఎచ్ పి బి సంధ్య, ఏ ఎన్ ఎం స్వరూప రాణి గైరాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రిజిస్టర్ లో ఆబ్సెంట్ వేసి ఒకరోజు జీతంలో కోత విధించాలని, ఆరోగ్య కేంద్రానికి సమయ వేళలు పాటించాలని అన్ని రిజిస్టర్లు రాసేలా చర్యలు తీసుకోవాలని డి ఎం హెచ్ ఓ కు ఫోన్ ద్వారా ఆదేశించారు. హెల్త్ సూపర్ వైజర్స్, ఏఎన్ఎం, ఆశాలు మీకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి బిపి చెక్ చేయించుకున్నారు.