23-10-2025 07:41:36 PM
టీఎస్ యూటీఎఫ్..
నకిరేకల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ గురుకులాలన్నింటికీ ఒకే టైం టేబుల్ ఉండాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం అన్నారు. గురువారం మండలంలోని వివిధ గురుకుల సొసైటీలో టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంల సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మైనార్టీ గురుకులాల్లో అమలు చేస్తున్న టైం టేబుల్స్ ను మిగతా గురుకుల సొసైటీలైన బీసీ, ఎస్సీ గురుకుల సొసైటీలలో కూడా ఒకే విధమైన టైం టేబుల్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.నర్సింహమూర్తి, కుర్మెళ్ళ శ్రీనివాస్ నాయకులు జి.శ్రీలత, పి. జ్యోతి, ఈ.హరికృష్ణ, పి.జయసాగర్ పాల్గొన్నారు.