23-10-2025 07:51:00 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు, సూచనలతో మెగా జాబ్ మేళా సర్వం సిద్ధం..
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
యువత నైపుణ్యం ఉన్న రంగంలో విజయం సాధించాలి
సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్,
హుజూర్ నగర్: ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో జాబ్ మేళాకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని యువత భారీ సంఖ్యలో పాల్గొని సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్ నేషనల్ స్కూల్ లో నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను గురువారం జిల్లా ఎస్పి కొత్తపల్లి నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. కంపెనీల వారీగా స్టాల్స్ కేటాయింపుల వివరాలను అందజేయాలనీ సింగరేణి ప్రతినిధి చందర్ ను ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద అభ్యర్థులు ఎక్కువగా నిలబడకుండా రంగాల వారీగా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, డిగ్రీ కళాశాల, మార్కెట్ యార్డ్, స్వర్ణ వేదిక పంక్షన్ హాల్ ప్రక్కన ఉన్న వెంచర్ లను పరిశీలించి పార్కింగ్ ఏర్పాటు చేసి కుర్చీలు ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద, భోజనాల వద్ద ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూడాలన్నారు.జాబ్ మేళా ప్రాంగణానికి అప్రోచ్ రోడ్లను వేయాలని, మొబైల్ టాయిలెట్స్, అభ్యర్థుల సౌక్యార్థం జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. వర్షం కురిసిన వాటర్ ప్రూఫ్ టెంట్ లను జాబ్ మేళా ప్రాంగణం,స్వర్ణ వేదిక పంక్షన్ హాల్ ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలన్నారు.
సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ మాట్లాడుతూ... యువత నైపుణ్యం ఉన్న రంగంలో విజయం సాధించాలన్నారు. 250 కంపెనీల హాజరుతో 20 వేలకు పైగా యువతీ యువకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయి పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్య నారాయణ, డిఎస్పి ప్రసన్న కుమార్, సింగరేణి ప్రతినిధి చందర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి శంకర్, జిఎం ఇండస్ట్రీస్ సీతారాంనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిఎస్పీలు ప్రసన్నకుమార్,రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు,సర్కిల్ ఇన్స్ స్పెక్టర్లు చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ప్రతాప్ లింగం, ఎస్సైలు మోహన్ బాబు, నరేష్, రవీందర్, బాబు, కోటేష్,ఏఐసిసి సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, చింతకుంట్ల లక్ష్మి నారాయణ రెడ్డి,దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, తన్నీరు మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు.