calender_icon.png 24 October, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోరక్షకుడు సోను సింగ్ పై కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నాం

23-10-2025 07:43:49 PM

దుండగులపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..

బీజేపీ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్..

చిట్యాల (విజయక్రాంతి): గోరక్షకుడు సోను సింగ్ పై కాల్పులను ఖండిస్తున్నామని, కాల్పులు జరిపిన దుండగులపై దేశద్రోహం కేసు పెట్టాలని గురువారం బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తెలిపారు. గోరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తూ సమాజానికి సేవ చేస్తున్న గోరక్షకుడు సోను సింగ్ పై హైదరాబాద్ శివారులో పోచారం కారిడార్ లో కాల్పులు జరిపి దాడి చేయడం దారుణమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చిట్యాల పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఇది వ్యక్తిపై దాడి మాత్రమే కాదని, గోమాత పట్ల గౌరవం, భారతీయ సంప్రదాయ విలువలపై దాడిగా మేము భావిస్తున్నాము అని, సోను సింగ్  దేశ చట్టాల పరిధిలో ఉంటూ గోరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఆయనపై ఇలా దాడి చేయడం అప్రజాస్వామికం, అనాగరికం అని, ఇటువంటి ఘటనలు సమాజంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే ప్రయత్నాలుగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ దాడిలో పాల్గొన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, గోరక్షకుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సోను సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించి తగిన వైద్య సహాయం అందించాలని కోరారు.  శాంతి, సహనం, గౌరవంతో కలిసి జీవించే భారతీయ విలువలను కాపాడే క్రమంలో అందరూ ఒకరి బాధను మరోకరు పంచుకోవాలని, గోరక్షకుల సేవలను గౌరవించే సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలని మనవి చేశారు. సోను సింగ్  ధైర్యసాహసాలు మాకు స్ఫూర్తి అని, ఆయనకు న్యాయం జరిగే వరకు హిందూత్వ వాదులు, గోమాత రక్షకులు, ప్రజాస్వామ్య వాదులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గోరక్షకుడు సోనుసింగ్ పై కాల్పులు జరిపిన దుండగులపై దేశద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.