calender_icon.png 24 October, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

23-10-2025 07:58:40 PM

యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు నిద్ర సంపత్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు నిద్ర సంపత్ నాయుడు అన్నారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల మన్ననలతో ఎంపీగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తూ అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకుడిపై మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారం లేని చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అందిస్తుంటే చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.