23-10-2025 07:52:32 PM
బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం
గాంధారి (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ ఆదేశానుసారం గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు శివాజీ రావు , శ్రీనివాస్ నాయక్, ముస్తఫా ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు షేక్ పెట్ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 6 గ్యారంటీల తో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టడం జరిగిందని , అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు చైతన్య పరుస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
జూబ్లీహిల్స్ పరిధిలో హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరును జూబ్లీహిల్స్ ప్రజలకు కండ్లు కు కట్టే విధంగా వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు సూచిస్తున్నారు. మహిళలకు పెన్షన్లు,ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం వంటి దొంగ హామీలను శేఖపేట్ ప్రజలకు వివరిస్తున్నారు. షేక్పేట్ డివిజన్ ఇంచార్జ్, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జజాల సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులతో ఎప్పటికప్పుడు షేక్పేట్ డివిజన్లోని మండలాల వారీగా సన్నాక సమావేశలు నిర్వహిస్తూ అభ్యర్థి గెలుపు కొరకు ప్రణాళికలను రచిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు శివాజీ రావు, శ్రీనివాస్ నాయక్, ముస్తఫా, పండిత్, కపిల్ రెడ్డి, మదాం సాయిలు తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.