calender_icon.png 14 May, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ తర్వాత రీయింబర్స్‌మెంట్ బిల్లులు

17-12-2024 02:30:45 AM

* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల తర్వాత నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మొదలు పెడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల యజమాన్యాల యూనియన్ ప్రతినిధులు భట్టిని కలిశారు. బకాయిల విడుదలపై డిప్యూటీ సీఎంతో యూనియన్ ప్రతినిధులు చర్చించారు. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వీలైనంత తొందరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించడానికి కృషి చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ అడ్డగోలుగా చేసిన అప్పుల వల్ల ప్రభుత్వంపై భారం పడిందన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో కానీ, తెలంగాణలోకానీ 10 నెలల కాలంలో రైతు రుణమాఫీ, ప్రభుత్వ అప్పులకు రూ.87 వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వం ఇప్పటివరకు లేదన్నారు. రీయింబర్స్‌తో కాంగ్రెస్‌కు బాండింగ్ ఉందన్నారు.