17-12-2024 02:32:46 AM
హైదరాబాద్ శివారులో మరో జూ పార్క్
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): 2025 సంబంధించిన టూరి జం పాలసీ రూపకల్పన తుదిదశలో ఉంద ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలూనా యక్, వంశీ, రామ్‌చంద్రునాయక్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పా రు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం పాలసీలను తీసుకొస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్ సమీపంలో నూతన జూ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మినీ జూ పార్కులను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు జైవీర్‌రెడ్డి కోరగా.. సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానమిచ్చారు.