calender_icon.png 9 August, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంఘాలు ఏక తాటి మీదకు రావాలి

09-08-2025 05:49:34 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర బీసీ సంఘాలు ఏకతాటి మీదికి రావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కన్వీనర్ కోడూరి చంద్రయ్య అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి తమ వంతు ప్రయత్నం చేయడం జరిగిందన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ 42 శాతం రిజర్వేషన్ బిల్లుల నుంచి ముస్లింలకు 10 శాతం తొలగిస్తే మేము బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి శక్తిసామర్థ్యాలను ఉపయోగించి నెరవేరుస్తామని అంటున్నారన్నారు. ఈ నిర్ణయంపై బీసీ సంఘాలు పరిశీలించి, వెంటనే స్పందించి ,రిజర్వేషన్ల సాధన కొరకు కార్యచరణ రూపొందించాలని కోరారు.