calender_icon.png 9 August, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంటిస్ట్ ప్రత్యూష ఆత్మహత్య కేసు..

09-08-2025 06:25:55 PM

భర్త డాక్టర్ సృజన్‌కు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ..

హన్మకొండ (విజయక్రాంతి): హనుమకొండ(Hanamkonda)లో డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మృతురాలి భర్త డాక్టర్ సృజన్‌ కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అతడిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, జూన్ 15న డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష భర్త సృజన్ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రలు తమ బిడ్డకు చావుకు కారణం భర్తేనని, విడాకులు ఇవ్వాలని వేధించారని హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త సృజన్, అత్తమామలు పుణ్యవతి, మధుసూదన్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ భానోతు శృతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై బి ఎన్ ఎస్ యాక్ట్ 108, 115(2), 292, 351(2), 85 r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.