calender_icon.png 9 August, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ

09-08-2025 06:05:01 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): భూ భారతి పోర్టల్ ద్వారా జూన్ 5, 2025 వరకు రెవెన్యూ పట్టా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులు మాత్రమే రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని కేసముద్రం వ్యవసాయ అధికారి బానోతు యాంకర్ వెంకన్న(Agriculture Officer Venkanna) సూచించారు. రైతు బీమా కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదన్నారు. రైతు బీమాలో నామిని పేరు, ఫోన్ నెంబర్ మార్పు చేసుకోవడానికి కూడ అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేయడానికి ఈనెల 12 వరకు అవకాశం ఉందన్నారు. 18 సంవత్సరాల వయసు నుంచి 59 సంవత్సరాల వరకు మాత్రమే అర్హులని, 14-08-1966 నుండి 14-08-2007 లోపల జన్మించిన వారికి రైతు బీమా పొందెందుకు అవకాశం ఉందన్నారు. దీనికి కావలసిన ధృవ పత్రాలు 1. రైతు బీమా అప్లికేషన్ ఫారం 2. రైతు పట్టా పాస్ బుక్ 2. రైతు ఆధార్ కార్డు 3. నామిని ఆధార్ కార్డ్ ద్వారా క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కోరారు.