09-08-2025 06:23:59 PM
మంథని (విజయక్రాంతి): మంథని(Manthani)లో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి, డివిజన్ నాయకులు సందీప్, ఆర్ల నాగరాజు, పేరం లింగన్న యాదవ్, మంథని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ లో మహిళలతో రాఖీలు కట్టించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
డిపో మేనేజర్ తో మాట్లాడి మహిళల ప్రయాణ సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మేనేజర్ బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ 1960లో స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య యువజన విభాగం, యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగందన్నారు. యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ఓనమాలు నేర్చి అనేకమంది దేశవ్యాప్తంగా ప్రముఖంగా రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు. యువత రాజకీయంగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ మంచి ప్లాట్ ఫామ్ అని ఈ సందర్భంగా తెలిపారు. గత 10 సంవత్సరాలు యువజన కాంగ్రెస్ ప్రతి గ్రామాల తిరుగుతూ గ్రామ గ్రామాన యువజన కాంగ్రెస్ కమిటీలు వేసి అనేక ధర్నాలు, దీక్షలు చేసి అధికారంలోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిందన్నారు.
అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు ఏదైతే ఈ నియోజవర్గాన్నే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోతు ఉన్నారని, ఈ ప్రాంతంలో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు తాగునీరు సాగునీరు అందిస్తూ అన్ని రంగాలలో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్నారని, శ్రీనుబాబు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వారు పరిష్కరిస్తూ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారని వారు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబు నాయకత్వంలో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడం, శ్రీధర్ బాబు ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.