calender_icon.png 9 August, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోండుగూడలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

09-08-2025 06:18:21 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal)లోని గోండుగూడ గ్రామంలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు జెండా ఎగురవేసి డోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేశారు. మన ఊరు, మనభూమి, మన హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని యూత్ అధ్యక్షుడు బొజ్జిరావు పిలుపునిచ్చారు. ఆదివాసీల మీద జరుగుతున్న దాడులను ఆపాలని, పోడు భూముల సమస్యలు పరిష్కరించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 49 ను వెంటనే రద్దు చేసి ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాలని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని, యువతి యువకులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దౌలత్ రావు, సోనేరావు,దర్ము,భీము, హనుమంతు, జంగు, అశోక్, తిరుపతి, మల్కు తదితరులు పాల్గొన్నారు.