09-08-2025 06:21:17 PM
హన్మకొండ (విజయక్రాంతి): ఆదివాసి గిరిజన దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాపాడాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వీరన్న(Tribal Association District Secretary Viranna) అన్నారు. ఈరోజు గిరిజన భవన్ లో జరిగిన ఆదివాసి దినోత్సవ సభలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వి వీరన్న పాల్గొని మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో విద్య వైద్యం అందించాలని అక్షరాస్యత శాతం పెంచాలని, సంక్షేమ పథకాల అందించాలని, గిరిజన విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని అప్పుడే ఈ సమాజము అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు జరిగాయని అందులో కొమరం భీమ్ పోరాటము భూమి కావాలని జరిగిన తిరుగుబాటు ఒకటని, సమ్మక్క సారక్క పోరాటం హక్కుల కోసం జరిగిందని, తాను నాయక్ విసునూరు దొరల నుండి ప్రజలను రక్షించిన పేద ప్రజలకు భూమి ఇచ్చిన పోరాటమని అన్నారు. ప్రభుత్వ రంగంలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు.
కరపత్రాన్ని ఆవిష్కరించిన వీరన్న
ఆగస్టు 12 తారీఖున జరిగే ఆదివాసీ గిరిజన సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని వీరన్న ,మరియు గిరిజన విద్యార్థుల తో కలిసి విడుదలచేశారు.అనంతరం మాట్లాడుతూ ఈ నెల 12 రోజు నా జరిగే గిరిజన సదస్సు ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వి వీరన్న, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు బి. రాజు నాయక్, కొమరం స్వాతి, మంకిడి సురేందర్ పాల్గొన్నారు.