calender_icon.png 14 November, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికను వేధించిన యువకుడికి రిమాండ్

14-11-2025 12:17:59 AM

సిద్దిపేట క్రైం, నవంబర్ 13 : ప్రేమ పేరిట మైనర్ బాలికను వేధించిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్టు సిద్ధిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. సిద్దిపేట శివారులోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్న ఎండీ సమీర్(22) అనే యువకు డు ఈ నెల 10న రాత్రి బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ’మీ కూతురిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా’ అని గొడవ చేశా డు.

ఈ విషయమై మరుసటి రోజు బాలిక తల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చే సింది. ఎస్‌ఐ ఆసిఫ్ కేసు నమోదు చేసి, నిం దితుడిని గురువారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.