14-11-2025 12:19:09 AM
అమీన్ పూర్, నవంబర్ 13 :అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వడక్పల్లి నుండి గడ్డపోతా రం మున్సిపాలిటీ మాదారం శివా రు సమీపంలో రహదారి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో ఈ రోడ్డు ప్రయా ణికు లకు ఇబ్బందికరంగా మారింది. గతనెల 12న విజయక్రాంతి దినపత్రికలో రోడ్డంతా గుంతలమయం అనే శీర్షికన ప్రచురించిన కథనానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పందించారు.
ఈ మేరకు అధికారు లతో ఫోన్లో మాట్లాడి సమస్యను తొందరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్‌ఎంపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి రోడ్డుపై ఉన్న గుంతలలో కంకర, ఆల్ మిక్స్ మరమత్తు పనులు చేస్తున్నారు. రెండు రోజుల్లో డాంబర్ తో గుంతలు మరమ్మతు చేస్తామని ఆర్‌అండ్ బి అధికారులు వెల్లడించారు.