calender_icon.png 27 December, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా జీవితాన్ని గుర్తుచేసుకున్నా..

25-10-2024 12:00:00 AM

సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. చాలా కాలం తర్వాత సమంత ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సమంత పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను ఇలతెలిపారు.

‘హనీలో నా నిజ జీవితానికి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి. ఆ పాత్ర గురించి నేను విన్నప్పుడు నా నిజ జీవితానికి హనీ పాత్ర ఎంత దగ్గరగా ఉంటుందో తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను నటించడానికి ముందు నా జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాను. నా చిన్ననాటి జీవితం, గత అనుభవాలన్నింటినీ డ్రా చేసుకున్నా. అవన్నీ నా నటనకు చాలా సాయపడ్డాయి” అని తెలిపారు.