calender_icon.png 28 July, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటేల్‌గూడలో శిథిలాల తొలిగింపు

17-12-2024 12:28:13 AM

ఇండ్ల కూల్చివేతలకు వచ్చారని స్థానికుల ఆందోళన

పటాన్‌చెరు, డిసెంబర్ 16: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడలో హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేసిన ఇండ్ల శిథిలాల తొలగింపు పనులను సోమవారం చేపట్టారు. ఉదయమే హైడ్రా అధికా రులు యంత్రాలతో రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. మళ్లీ ఇండ్ల కూల్చివే తలు జరుగుతాయంటూ పుకార్లు మొదలయ్యాయి. కానీ గతంలో కూల్చివేసిన ఇండ్ల శిథిలాలను సిబ్బంది తొలగిస్తుండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.