calender_icon.png 7 July, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే వంతెన నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ పోల్స్ తొలగింపు

07-07-2025 01:50:02 AM

ఘట్ కేసర్, జూలై 6 : ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ పోల్స్ ని విద్యుత్ ఏఈ యశ్వంత్ కుమార్ తో మాట్లాడి తొలగింప జేస్తున్నట్లు ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తెలిపారు.

వంతెన స్లాబ్ కి అడ్డుగా ఉన్న విద్యుత్ పోల్స్ ని సంబంధిత అధికాతులతో కలిసి పోల్స్ తీయించడం జరగిందని, అతి త్వరలో వంతెన నిర్మాణం పనులు పూర్తి చేసి అందుబాటులో కి తెచ్చుకుందామని, కావున ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. అతి త్వరలో కోర్టుకు వెళ్లిన 11 మంది బాధితుల సమ స్య కూడా పరిష్కారం చేస్తామని తెలిపారు.

ఈకార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ , మాజీ వార్డు సభ్యులు దేవేందర్, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, జేఏసీ నాయకులు మారం లక్ష్మా రెడ్డి, బచ్చు ప్రమోద్, నాగేష్, కమలాకర్ , శివరాత్రి సురేష్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.