26-01-2026 10:56:53 AM
భిక్కనూర్, జనవరి 26(విజయ క్రాంతి: భిక్కనూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో సిఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఆంజనేయులు, టీపీసీసీ సెక్రటరీ ఇంద్రకీరన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చాంద్రకాంత్,పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య వ్యవస్థను గుర్తు చేసే మహత్తరమైన దినమని తెలిపారు.