26-01-2026 03:17:19 AM
మంత్రి పొన్న ప్రభాకర్
ముకరంపుర, జనవరి 25 ( విజయ క్రాంతి) మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర జనవరి 28 నుండి 31 మధ్య ఉన్నందున ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్ లలో 51 కేంద్రాల నుండి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, 4 వేల ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం భద్రత అధికంగా ఉం టుందని ఆర్టీసీ బస్సులు గద్దెల వరకు వెళ్లే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
జాతరకు వచ్చే పి ల్లలు తప్పిపోకుండా ఉండడానికి పోలీస్ శాఖ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చిందని అందరూ దీన్ని ఉ పయోగించుకోవాలని కోరారు. ఫోన్ టాపింగ్ పై సమాధానం ఇస్తూ మా ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించదని చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఇందులో ముఖ్యమంత్రి, మంత్రుల సహా ఏ ప్రభుత్వ ,ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం వారికి అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని వారి ఊహ అయి ఉం డొచ్చు అట్లాంటి పరిస్థితి ఉండదు అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు.