26-01-2026 10:58:59 AM
విజేతలుగా సనత్ నగర్ టైగర్స్ విజయం..
సికింద్రాబాద్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీలో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఆదివారం నాడు సనత్ నగర్ టైగర్స్ - గోల్డెన్ టైమ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గోల్డెన్ టైమ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 113 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సనత్ నగర్ టైగర్ జట్టు 9.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి114 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్ లో 22 పరుగులు చేసి, బౌలింగ్ లోను రెండు వికెట్లు తీసిన ఈనాడు సతీష్ కు మేన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ విజేత జట్టుకు సిటీ మీడియా కన్వీనర్ శ్రీనివాస్ రెండు జట్ల సభ్యులకు ఏబీవీ ఫౌండేషన్ తరపున సర్టిఫికెట్ల ను అందజేశారు.ఈ అనంతరం క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రీడాస్ఫూర్తిని అలవరచుకోవాలని మీడియా కన్వీనర్ శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ జట్టు కెప్టెన్లుగా గోల్డెన్ టైమ్స్ పరమేశ్వర్,సనత్ నగర్ టైగర్స్ హెచ్ఎంటీవీ శ్రీకాంత్, జట్టు సభ్యులు విజయ క్రాంతి మాణిక్యాలరావు, ఈనాడు సతీష్, ఎన్టీవీ ప్రవీణ్,10 టీవీ బాలకృష్ణ,దిశ వెంకట్, ఆంధ్రజ్యోతి సుధీర్,స్వతంత్ర టీవీ ఎల్లేష్, ప్రజా జ్యోతి రమేష్ యాదవ్,రాంబాబు, కనకరాజు,ఐ న్యూస్ ఇమ్రాన్ పాల్గొన్నారు.