23 June, 2026 | 2:32 AM

గ్రామ పంచాయతీ భవన నిర్మాణ మంజూరుకై వినతి

23-06-2026 12:00 AM

వెల్దండ జూన్ 22: గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం కడ్తాల్ మండలంలోని నూతన ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వెళ్లండ గ్రామ సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్ వినతి పత్రం అందజేశారు.

మంత్రి  భవన నిర్మాణానికి సానుకూలంగా స్పందించారని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి రషీద్, పసునోజు పురుషోత్తమాచారి, గుద్దటి కిష్టల్, మసిగుండ్ల వెంకటేష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య,,మరేపల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ యుయు అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.