23 June, 2026 | 1:05 AM

మందుబాబులకు అడ్డాగా పాఠశాల

23-06-2026 12:03 AM

రాజాపూర్ జూన్ 22 : మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మందుబాబులకు అడ్డగా మారింది. పాఠశాల గ్రామానికి కొద్దిగా దూరంలో ఉండడంతో ఆదివారం రాత్రి మందుబాబులు అక్కడే తిష్ట వేసి తాగుతూ కాళీ బీరు సీసాలను తరగతి గదులలో పగుల కొట్టి దేవాలయంల చూసే పాఠశాలను అపవిత్రం చేస్తున్నారు.

పగిలిన గాజు పెంకులు విద్యార్థులకు గుచ్చుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పోలీసులు నిత్యం పాఠశాల వద్ద పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.