calender_icon.png 7 November, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోలార్ విద్యుత్ కు నిధులు కేటాయించాలని వినతి

07-11-2025 06:17:25 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని బాబాపూర్ లో గల మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని సోలార్ విద్యుత్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుకన్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల స్టడీ సమయంలో రాత్రి వేళల్లో కరెంటు తరచూ పోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని, బాలికలు కావడంతో రాత్రి సమయంలో కరెంట్ లేకపోతే భయాందోళన చెందుతున్నారని ప్రిన్సిపాల్ డీసీసీ దృష్టికి తీసుకువెళ్లారు.సోలార్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.