calender_icon.png 20 August, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీఎంలో ఎన్నికలు నిర్వహించాలని మంత్రికి వినతి

20-08-2025 06:02:07 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మిక శాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం చేస్తున్న ఆరోపించారు. ఎన్నికలు లేకపోవడంతో యాజమాన్యం కార్మికుల హక్కులను అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు.