14-05-2025 12:00:00 AM
మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నదీమ్ అహ్మద్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే13 (విజయ క్రాంతి) : పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని మైనారిటి సంక్షేమ శాఖ జిల్లా అధికారి నదీమ్ అహ్మద్ అన్నారు. మంగళవారం జైనూర్ మండల కేంద్రంలోనీ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పా టు చేసిందని, ఈ పాఠశాలల్లో అన్ని వసతులతో పాటు నాణ్యమైన విద్య బోధన జరు గుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లలను మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివిపించి విద్య వంతులుగా తీర్చిదిద్దాలన్నా రు. కాగజ్ నగర్ లోనీ బాలుర మైనారిటీ పాఠశాలలో ఇంటర్ వరకు ప్రవేశాలు అం దుబాటులో ఉన్నాయని, బాలికల కోసం ఆసిఫాబాద్, జైనూర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఆర్ ఎల్ సి పుష్పలత, అకాడమిక్ కోఆర్డినేటర్ రిజ్వా న్, పాఠశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వరి, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబు తాలిబ్, సన్ రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జమీల్, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శేఖ్ రషీద్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు ఫిరోజ్ ఖాన్, నాయకులు షేక్ హైదర్, ఖదీర్,ఇక్బాల్, మౌలానా దస్తగిర్,సయ్యద్ ముబీన్ తదితరులున్నారు.