calender_icon.png 14 May, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ

14-05-2025 12:00:00 AM

  1. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జొన్నలు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, మే 13 (విజయ క్రాంతి) : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జొన్నలను కొనుగోలు చేసే దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని బేలా మండల సబ్ మార్కెట్ యార్డును కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలో మరో రెండు కేంద్రాలను పెంచనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో జొన్న సాగు జరిగిందని, 7 నుండి 8 లక్షల క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపటనునట్లు తెలిపారు. మార్కెట్ యార్డ్‌లో నెలకొన్న హమాలీల కొరత,  కాంటాల కొరత, రవాణా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

నిబంధనల ప్రకారం హమాలీలకు కూలి ధర ను చెల్లించని దళారుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, డిసిఓ మోహన్ నాయక్, సంభందిత అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు.