15-10-2025 08:21:28 AM
బెజ్జూర్, (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలం సారసాల గ్రామంలో పెద్దపులి సంచారించిందని ఫారెస్ట్ అధికారులు డప్పు చాటింపు చేయించారు.పెద్ద పులి(Tiger) సంచారం తో పంట పొలాలకు వెళ్లే రైతులు, గ్రామస్తుల అప్రమత్తంగా ఉండాలని అడవిశాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. పత్తి పంట చేనులోకి వెళ్లిన సమయంలో గుంపులు గుంపులుగా వెళ్తూ శబ్దాలు చేయాలని తెల్లవారుజామున రాత్రి సమయం అయ్యేవరకు పంటపొలాలలో రైతులు ఉండకూడదు అని అధికారులు తెలుపుతున్నారు.