calender_icon.png 24 September, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీతాలు చెల్లించాలని వనదేవతలకు వినతి

24-09-2025 12:22:42 AM

 హనుమకొండ సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1654 మంది అతిథి అధ్యాపకులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు లేక అల్లాడిల్లి పోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్ విడుదల చేయాలనీ, లేదంటే పండుగ పూట పస్తులుండాల్సి  వస్తుందని వాపోతున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అతిథి అధ్యాపకులు మంగళవారం మేడారం వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనుకున్నారు.

కానీ భద్రత కారణాలవల్ల కలవలేక వనదేవతలను కలసి వినతి పత్రం సమర్పించి వేడుకున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం నాలుగు నెలల జీతాలు, ఈ సంవత్సరం మూడు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని, 1654 కుటుంబాలు రోడ్డున పడకుండా రెన్యువల్ కల్పించి, ప్రజాపాలన ప్రభుత్వం హామీని అమలు చేయాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ములుగు, జనగామ, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు,కిరణ్,రాజు,నిర్మలాదేవి, సమ్మయ్య,రజిని తదితరులు పాల్గొన్నారు.