calender_icon.png 25 September, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మూర్‌లో కోటపాటి జన్మదిన వేడుకలు

24-09-2025 11:53:49 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ప్రముఖ రైతు నాయకుడు గల్ఫ్ కార్మిక నేత ఆర్మూర్ వాసి కోటపాటి నరసింహం నాయుడు 66 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు,  ఆర్మూర్ లోని వంశీ గ్యాస్ ఏజెన్సీస్ ప్రాంగణంలో జరిగిన కోటపాటి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి, గోదావరి హారతి రాష్ట్ర సభ్యులు మోత్కూరి దేవ గౌడ్ పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు, కోటపాటి తన ప్రతి పుట్టినరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా ఆర్మూర్ ప్రాంతంలోని యువకులను సమీకరించి పెద్ద ఎత్తున ఇండియన్ రెడ్ క్రాస్సొసైటీ కి అందజేశారు.

ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి, దేవగౌడ్ లు మాట్లాడుతూ... కోటపాటి నరసింహం నాయుడు  సామాజిక సేవలలో భాగంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువకులను ఉత్తేజ పరచడం రైతులు గల్ఫ్ కార్మికులు కోసం పాటుపడుతూ మాలాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు వారు ఆయు:రారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూకోటపాటికి శుభాకాంక్షలు తెలిపారు.