calender_icon.png 24 September, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.5 కే రెండు టీ షర్ట్స్

24-09-2025 12:21:24 AM

-కేవలం చిన్న పిల్లలకే అంటూ షాపు యజమాని ప్రకటన 

-ఎగబడ్డ జనం 

మహబూబాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): దసరా, దీపావళి పండగలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ రెడీ మెడ్ దుస్తుల షాపు యజమాని చిన్నపిల్లలకు కేవలం 5 రూపాయలకే 2 టీ షర్టులు ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు.  దీంతో మంగళవారం ఒక్కసారిగా జనం షాపు వద్ద ఆఫర్ టీ షర్టుల కోసం ఎగబడ్డారు. జనం ఎక్కువ కావడంతో ఆ ప్రాంతం రద్దీతో నిండిపోయింది. కొందరు మహిళలు అయితే ఏకంగా చిన్నపిల్లల్ని వెంట పెట్టుకొని మరీ వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు.

మంగళవారం షాప్ కొత్తగా ప్రారంభిస్తున్న సందర్భంగా ఐదు రూపాయల కు రెండు టీ షర్టుల ఆఫర్ పెట్టామని, అలాగే 9 నుంచి 99 రూపాయల వరకు చిన్నపిల్లలకు అవసరమైన రెడీమేడ్ దుస్తులు లభిస్తాయని హోర్డింగ్ పెట్టారు. ఏది ఏమైనా షాప్ ఓపెనింగ్ సందర్భంగా పబ్లిసిటీ కోసం షాపు యజమాని పెట్టిన ఆఫర్ కోసం జనం ఎగబడ్డారు.