calender_icon.png 8 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి

08-10-2025 06:23:31 PM

అర్మూర్ (విజయక్రాంతి): రైతులు పండించిన పంటల కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి  డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రైతాంగానికి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్న విధంగానే రైతాంగ పరిస్థితి ఉందని వాపోయాడు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల 2400 ధర ఉండగా దళారులు తమ ఇష్టం వచ్చినట్టు క్వింటాలకు 1800 నుంచి 2000 కంటే మించి కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నాడు. వాతావరణ పరిస్థితుల దృశ్య రైతాంగం గత్యంతరం లేక  కింటాలుకు నాలుగు ఐదు వందలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్టి, బాజన్న, పోశెట్టి, మల్లయ్య, శ్రీనివాస్, కలిగోట ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.