31-12-2025 12:00:00 AM
జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపును ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాదులోని బీసీ భవన్‌లో బీసీ ఉపాధ్యాయ సంఘం బీసీటీయూ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు.
జనాభాలో 60 శాతంపైగా ఉన్న బీసీలకు ఉద్యోగ రంగంలో స్వాతం త్య్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత కూడా 20% కూడా ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే అందులో 40 వేల మం ది బీసీ ఉపాధ్యాయులు ఉన్నారని ఇంతమంది ఉన్న బీసీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే గుర్తింపుని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇన్ సర్వి స్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. పిఆ ర్సీని 50 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చాలని కోరారు. బీసీ ఉద్యోగుల హక్కుల కోసం మార్చి రెండో వారంలో హైదరాబాదులో బీసీ ఉపాధ్యాయుల రాష్ట్ర మహాసభ ను నిర్వహిస్తామిన వెల్లడించారు. బీసీ ఉపాధ్యాయ సం ఘం రాష్ట్ర బాధ్యులుగా కొన్నే శంకర్‌గౌడ్, రాఘవాపురం గోపాలకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో వివిధ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాడవేడి వినోద్ కుమార్, శ్రీనివాస్, రమణ స్వామి, భాస్కర్ మహెందర్, గోపి కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రం గౌడ్, మనీ మంజరి పాల్గొన్నారు.