calender_icon.png 31 December, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగిపోయే వేళ.. స్టడీ టూర్లు ఎందుకు?

31-12-2025 12:00:00 AM

  1. ప్రజాధనం వృథా తప్ప నగరానికి ఒరిగేదేమీ లేదు 

కార్పొరేటర్ల పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దు 

పురపాలక శాఖకు ఎఫ్‌జీజీ లేఖ 

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీ కాలం ముగిసే దశలో కార్పొరే టర్లు చేపట్టాలనుకుంటున్న స్టడీ టూర్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో పదవీ కాలం ముగుస్తుండగా, ఇప్పుడు ఇతర నగరాలకు వెళ్లి ఏం నేర్చుకుంటారని, ఆ విజ్ఞానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది.

ఈ మేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి మంగళవారం రాష్ర్ట పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. కాగా సోమవారం జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్ల అధ్యయన యాత్రలకు అహ్మదాబాద్, చండీగఢ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై పద్మనాభరెడ్డి తీవ్రంగా స్పందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరితో జీహెచ్‌ఎంసీ పాలకవర్గ గడువు తీరిపోతుంది.

ప్పుడు కార్పొరేటర్లు టూర్లకు వెళ్లి, అక్కడి పట్టణ పాలనపై అధ్యయనం చేసి తిరిగి వచ్చేసరికి వారి పదవీ కాలం పూర్తవుతుంది. అలాంటప్పుడు వారు నేర్చుకున్న విషయాలను అమలు చేయడానికి సమయం ఎక్కడిది.. దీనివల్ల హైదరాబాద్ నగర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండదు.

కేవలం ప్రజాధనం వృ థా అవుతుంది అని లేఖలో పేర్కొన్నారు.్ర పభుత్వ ఉద్యోగుల విషయంలో పాటించే నిబంధనలను ఈ సందర్భంగా ఎఫ్‌జీజీ ప్రస్తావించింది. ఏడా ది కంటే తక్కువ సర్వీసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను విదేశీ శిక్షణకు గానీ, స్టడీ టూర్లకు గానీ ప్రభుత్వం పంపించదన్నారు. ఈ లేఖ ప్రతిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కూడా పంపారు.