10 April, 2026 | 2:38 AM

డ్రైనేజీ సమస్యలు పరిష్కారించండి

10-04-2026 12:50 AM

మన్నె గోవర్ధన్ రెడ్డి డిమాండ్

ఖైరతాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరానగర్ ప్రాంతంలో నెలకొన్న ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి  సమస్యలపై సమరం పేరుతో గళమెత్తారు. గురువారం ఆయన ఇందిరానగర్ ప్రాంతంలో స్వయం గా పర్యటించి స్థానికులతో ముఖాముఖి చర్చించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వేధిస్తున్న డ్రైనేజీ లీకేజీలు, అపరిశుభ్రతపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు.

సమస్య తీవ్రతను గమనించిన గోవర్ధన్ రెడ్డి సంబంధిత జలమండలి, మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలు అనారోగ్యం పాలవ్వకముందే యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భం గా మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజ ల ఆరోగ్యం, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.