07-08-2025 01:50:36 AM
ఖమ్మం, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటారు. అండర్ బాలుర కరాటే విభాగంలో ఎస్‌కే ఉబెద్ బంగారు పతకం, ఎస్‌కే రిహాన్ సిల్వర్ మెడల్, అండర్ బాలికల విభాగంలో బీ దీక్షిత బంగారు పతకం, అండ ర్‌షూ బాలుర విభాగంలో ఎన్ పృథ్వీరాజ్ బంగారు పతకాలు సాధించారు.
రెజొనెన్స్ శ్రీనగర్ విద్యార్థులు సౌత్ ఇండియా స్థాయిలో కరాటే నెపుణ్యాలను ప్రదర్శించి ఛాంపియన్‌షిప్ ట్రోఫిని కైవసం చేసుకోవడం సంతోషనీయమని పాఠశాల డైరెక్టర్లు కే శ్రీధర్‌రావు, కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్లు ట్రోఫీ, పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
12, 10 ఏండ్ల వయసులోనే కరాటేలో సౌత్ ఇండియా ఛాంపియన్ షిప్ ట్రోఫిని గెలుచుకోవటం గొప్ప విషయమని కొనియాడారు. తమ పాఠశాలలో ఆట పాటలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పీవీఆర్ మురళీమోహన్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని విజేతలను అభినందించారు.