07-08-2025 01:49:02 AM
కాంగ్రెస్ బీసీ ధర్నాపై ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై డ్రామాలొద్దని.. దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అ రుణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. బీజేపీని బద్నాం చేస్తామంటే ఊరుకోబోమన్నారు.
చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకా రం 42 శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందు లో 10 శాతం ముస్లిం మైనార్టీలకు ఇస్తామనడం బీసీలను మో సం చేయడమేనన్నారు. ఇప్పటికైనా కాం గ్రెస్ నేతలు డ్రామాలు ఆపాలనన్నా రు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని... అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి నాటకాలాడుతోందన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ.. కాం గ్రెస్ ఇలాంటివి ఎత్తులు వేయడం సాధారణమేనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నా అందులో భాగమేనన్నారు.