calender_icon.png 17 December, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించాలి

17-12-2025 12:00:00 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): మండలంలోని వదలపర్తి,కన్నారెడ్డి గ్రామాల నూతన సర్పంచులు పద్మ నారాయణ,సాయిలును రాష్ట్ర జడ్పిటిసిల ఫోరం మాజీ ప్రధాన కార్యదర్శి ఉమన్న గారి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన బాధ్యతను నీబద్ధతతో నిర్వహిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సమిష్టి కృషితో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. గ్రామాలను ఎంత అభివృద్ధిగా తీర్చేదితే అంత పేరు ప్రఖ్యాతలు వస్తాయని అంతే కాకుండా మరింత ఉన్నత పదవులు సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు సాయిబాబా, నారాయణ, దుర్గ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, రాము తదితరులు పాల్గొన్నారు.