calender_icon.png 17 December, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఎలక్షన్ అబ్జర్వర్

17-12-2025 12:00:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ మంగళవారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, తుది విడత ఓటింగ్ నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఏర్గట్ల, కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్, భీమ్గల్ తదితర చోట్ల పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, బుధవారం నాటి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను గమనించారు. రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట స్థానిక అధికారులు ఉన్నారు.