17-12-2025 12:00:00 AM
ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): జిల్లాలో మూడో విడత ఎన్నికలను సైతం ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 812 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 08 స్ట్రైకింగ్ ఫోర్స్, 37 రూట్ మొబైల్ పార్టీలు, 25 ఎఫ్‌ఎస్టీ బృందాలు, 05 ఎస్‌ఎస్టీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 క్రిటికల్, 9 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినుయోగించు కోవాలన్నారు. సెక్షన్ 163 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు న్నారు. జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బాన్స్ వాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్, మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కోడపగల్ మండలాలలో జరగనున్న సందర్భంగా, ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్,ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు.
ఈ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఐదు అంచెల భద్రతా వ్యవస్థలో మొత్తం 812 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 02 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 03 అంతర్జిల్లా చెక్పోస్టులు, 25 FST బృందాలు, 05 SST బృందాల ద్వారా నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు, అదనంగా 37 రూట్ మొబైల్ పార్టీలు, 08 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 03 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు మోహరించామని తెలిపారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలోని 10 క్రిటికల్ , 9 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు, ఉద్రేకం లేదా ప్రలోభాలు సృష్టించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోనికి ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలని సూచించారు. అలాగే 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంక్ బాటిల్స్, ఇంక్ పెన్స్, అగ్గిపెట్టెలు, వాటర్ బాటిళ్లు, కత్తులు తీసుకురావడం నిషేధమన్నారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమల్లో ఉంటుందని తెలిపారు. అక్రమ మద్యం రవాణా, నిల్వ, విక్రయాలు, అలాగే డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాల పంపిణీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించినా, సోషల్ మీడియాలో తప్పుడు లేదా విద్వేషపూరిత ప్రచారాలు చేసినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సెక్షన్ 163 BNSS అమలులో ఉన్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేస్తూ, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారని ఎస్పీ తెలిపారు.
అక్రమ కార్యకలా పాలపై కఠినంగా వ్యవహరిస్తూ రూ.8,52,170 విలువైన 1054.54 లీటర్ల మద్యం, రూ.4,50,250 విలువైన 1.635 కిలోల గంజాయి మరియు 43 గంజా మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేర చరిత్ర కలిగిన 211 మందిపై బైండోవర్, ఎన్నికల నియమావళి పరిదికి మించి తీసుకెళ్తున్న రూ.10,89,000 నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 18 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.