calender_icon.png 7 September, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రేన్ ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి

07-09-2025 12:18:38 AM

మహేశ్వరం, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో శనివారం విషాదం చోటు చేసుకుంది. న్యూ గాయ త్రినగర్‌లో రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్‌బాబు  రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో  భారీ క్రేన్ వాహనం ముందు టైరు అతని ఢీకొట్టడం తో రోడ్డుపై పడిపోయాడు. ఇది గమనించని  డ్రైవర్ నిర్లక్ష్యంగా అతనిపై నుంచి వాహనం తోలడంతో  ప్రసాద్ బాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.