28-01-2026 12:00:00 AM
జీఓ.౦౮ని వెంటనే అమలు చేయాలి
మెదక్, జనవరి 27 (విజయ క్రాంతి) రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని కోరుతూ మంగళవారం అంగన్ వాడి టీచర్స్ & హె ల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కు, శిశు సంక్షేమ శాఖా అధికారికి వేర్వేరుగా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సంధర్భంగా అంగన్ వాడి యూనియన్ జి ల్లా గౌరవాధ్యక్షులు ఎ. మల్లేశం మాట్లాడుతూ... శ్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అనేక సేవలు అందించి రిటైర్డ్ అయినారన్నారు.
2024 జూన్ లో రిటైర్డ్ అయినప్పటికి, సంవత్సరం న్నర కాలం పూర్తి అయిన వారికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం చెల్లించడం లేదని మండిపడ్డారు. అటు పింఛను, ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు అందకపోవడం తో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేక సేవలు అందించిన వారికే సేవ చేసేవారు లేక, ప్రభుత్వం ఆదుకోలేక పోవడంతో రోడ్లపై అడుక్కు తినే పరిస్థితి ఏర్పడిందని, కొందరు మానసికంగా కృంగి చనిపోతున్నారని అయినా రాష్ట్ర ప్రభుత్వానికి వారిపై కనికరం రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు రిటైర్డ్ అయినా అంగన్వాడీ ఉద్యోగులకు ఈ జి. ఓ ప్రకారం రి టైర్డ్ మెంట్ బెనిఫిట్స్ అమలు చేయలేదన్నారు. కావున రిటర్మెంట్ అయినా వారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు రెండు లక్షలు, ఆయాకు లక్ష ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ అయిన అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు.