28-01-2026 12:00:00 AM
అయిజ జనవరి 27: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో వార్డుల రిజర్వేషన్లు తారుమారై గందరగోళ పరిస్థితి ఏర్పడినా గెలుపుపై నమ్మకమున్న వ్యక్తులను ఏరికోరి ఎన్నికల బరిలో నిలబెట్టుకున్నామని ఆయా పార్టీలు సంసిద్దతను వ్యక్తం చేసుకుంటున్నాయి.ఇంకా కొన్ని వార్డులకు అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన కొనసాగిన గెలుపుపై ఎవరికి వారు దిమాను వ్యక్తం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు ప్రచారంలో పోటాపోటి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారని, వార్డు అభ్యర్థుల విషయంలో బీజేపీ ఇంకా ఖాతా తెరువలేదని ప్రజలు అనుకుంటున్నారు.సమయం తక్కువగా ఉన్నందువల్ల పోటీలో ఎవరిని నిలబెట్టాలని నాయకులకు ఆయా పార్టీలకు నిద్ర కరువైనట్టుగా, ఇంకా మిగిలిన వార్డులలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక తలలు పట్టు కుంటున్నారని పార్టీల కార్యకర్తలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా గెలుపు ఏ పార్టీని వరిస్తుందో ఫిబ్రవరి 13 వరకు వేచి చూడాలని పార్టీ నాయకులు మరియు ప్రజలు అనుకుంటున్నారు.