calender_icon.png 31 December, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు పదవి విరమణ సహజం

31-12-2025 07:26:05 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉద్యోగులకు పదవి విరమణ సహజమని అటవీ శాఖ అడ్మినిస్ట్రేటివ్ అధికారి వెంకటకృష్ణ అన్నారు. జిల్లా అటవీ శాఖలో 37 సంవత్సరాలుగా ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓగా సేవలు అందించి పదవి విరమణ చెందుతున్న నాజీర్ హుస్సేన్ కు జిల్లా కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి స్థానిక అటవీ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో రమాదేవి, అటవీశాఖ అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేసామనేది పదవీ విరమణ తర్వాత పేరు తెస్తుందన్నారు. ప్రభుత్వ శాఖలో పదవీ విరమణ సహజమని శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అటవీ సిబ్బంది నాజీర్ హుస్సేన్ ఘనంగా సన్మానించారు.