31-12-2025 07:22:25 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోను మండలంలోని గాంధీ నగర్ గ్రామంలో మత్స్య కార్మిక సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా బుధవారం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకున్నారు. మత్స్యక కార్మిక సంఘ అభివృద్ధికి కృషి చేసిన వారికి సన్మానం చేసి అభినందన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యువరాజ్ మాట్లాడుతూ జీవనోపాధి కోసం 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన మత్స్య కార్మికులు సంఘాన్ని ఏర్పాటు చేసుకొని చేపల వృత్తి ద్వారా జీవన ప్రమాణాలను పెంచుకున్నారని గుర్తు చేశారు సంఘం ఐక్యత కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక నాయకులు బసవరాజ్ సాయిలు భీమన్న ఆనంద్ తదితరులు పాల్గొన్నారు